ఆంధ్రప్రదేశ్ లో త్వరలో ఎన్నికల జోరు మొదలుకానుంది. ఇక్కడ తిరుపతి లో అతి త్వరలో ఉప ఎన్నికకు రంగంసిద్ధమవుతుంది. జగన్ అధికారంలోకి వచ్చాక వస్తున్న మొదటి ఉప ఎన్నిక కావడంతో ఈ ఉప ఎన్నిక ఎంతో ఉత్కంఠగా జరగనున్నాయి..దానికి తగ్గట్లు అధికార పార్టీ తో సహా, బీజేపీ , టీడీపీ పార్టీ లు సైతం ఇక్కడ గెలిచేందుకు కృషి చేస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ ఇక్కడ అభ్యర్థిని ప్రకటించగా బీజేపీ, వైసీపీ లు త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. తిరుపతి ఉప ఎన్నిక ఫలితంతో వచ్చే ఎన్నికల్లో ఎవరు వస్తారన్న భవిష్యత్ తెలిసిపోతుందని అంటున్నారు..