కొన్ని నెలల్లోనే బండి సంజయ్ తన పనితనం ఏంటో నిరూపించాడు.. రాష్ట్రంలో పార్టీ ని బలోపేతం చేయడంలో ఆయనదే కీలక పాత్ర.. ఇంత తొందర పార్టీ విజయ కేతనం ఎగురవేసి బలమైన టీ ఆర్ ఎస్ పార్టీ ని ఓడించే సత్తా ఒక్క బీజేపీ కే ఉందని నిరూపించాడు. అందుకు తగ్గట్లే గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ ని బలోపేతం చేసి ప్రజలు నమ్మే విధంగా చేశారు.. పార్టీ ఓడిపోయినా గెలిచినట్లుగానే భావిస్తున్నారు బీజేపీ నేతలు. ఈ ఎన్నికల ద్వారా తెలంగాణలో ప్రతిపక్ష కాంగ్రెసును తోసిపుచ్చి టీఆర్ఎస్ కు తానే ప్రత్యామ్నాయమంటూ ద్వితీయ స్థానం దక్కించుకుంది కమలం పార్టీ. రాష్ట్రంలో ఏ పార్టీ గెలిచినా హైదరాబాద్ లో తన ప్లేస్ కు ఢోకా లేదనుకున్న ఎంఐఎం ను మూడో స్థానానికి నెట్టేసింది.