మెగాస్టార్ చిరంజీవి. పరిచయం అవసరం లేని పేరు. రీ ఎంట్రీ లో వరుస సినిమాలు చేస్తున్న చిరు సైరా లాంటి సూపర్ హిట్ తర్వాత ఆచార్య అనే సినిమా లో నటిస్తున్నారు.. కొరటాల శివ దర్శకుడు.. మెసేజ్ ని కమర్షియల్ సినిమాలకు జోడించి మంచి హిట్లు కొట్టే కొరటాల శివ ఈ సినిమా లోనూ అలాంటి మెసేజ్ ని ఇమిడించి పక్కా మాస్ మసాలా సినిమా ని తెరకెక్కిస్తున్నాడట.. ఈ సినిమా వచ్చే ఏడాది కి రిలీజ్ అవుతుండగా అయన చేయబోయే తదుపరి సినిమాల ఆర్డర్ అటు ఇటు గా మారుతున్నట్లు తెలుస్తుంది. మొదటినుంచి మెగా స్టార్ చిరంజీవి సినిమాల విషయంలో, కథ విషయంలో, డైరెక్టర్ ల విషయంలో ఎంత శ్రద్ధగా ఉంటాడో అందరికి తెలిసిందే..