ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రాజమౌళితో “రౌద్రం రణం రుధిరం” అనే బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా అలాగే ఈ చిత్రం అనంతరం తారక్ మరికొన్ని సినిమాలను ఓకే చేసిన విషయం కూడా తెలిసిందే. మరి ఈ లిస్ట్ లో మొదటి వరుసలో ఉన్నది మాత్రం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ప్లాన్ చేస్తున్న “అయినను పోయి రావలె హస్తినకు” చిత్రం ఉంది.