ఆంధ్రప్రదేశ్ లో త్వరలో ఎన్నికల జోరు మొదలుకానుంది. ఇక్కడ తిరుపతి లో అతి త్వరలో ఉప ఎన్నికకు రంగంసిద్ధమవుతుంది. ఇప్పటికే ఇక్కడ అన్ని పార్టీ ప్రచారం కోసం అన్ని సిద్ధం చేస్తుండగా ఆ పార్టీ కి ఆ పార్టీ గెలుపు ధీమా వ్యక్తం చేస్తుంది.. 151 సీట్లతో గెలిచి అధికారంలోకి వచ్చిన వైసీపీ ఇక్కడ హాట్ ఫెవరెట్ గా దిగుతుండగా అండర్ డాగ్స్ గా బీజేపీ, జనసేనలు దిగబోతున్నాయి..అయితే ఇద్దరిలో ఎవరు పోటీకి దిగబోతున్నారో అన్న విషయం ఇంకా క్లారిటీ రాలేదు. ఆపనిమీదే సోము వీర్రాజు ఢిల్లీ లో మంతనాలు చేస్తున్నారు.