కేంద్రమంత్రి సదానంద గౌడ (67) ఇవాళ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాష్ట్రస్థాయి బీజేపీ సమావేశంలో పాల్గొని శివగంగ నుంచి బెంగళూరు వస్తుండగా ఆయన రక్తంలో చక్కెరస్థాయి పడిపోవడంతో కుప్పకూలిపోయారు. దాంతో ఆయనను ఈ సాయంత్రం చిత్రదుర్గలోని ఆస్టర్ సీఎంఐ ఆసుపత్రికి తరలించారు. సదానంద గౌడకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు షుగర్ లెవల్స్ తగ్గిపోయినట్టు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.