తాడిపత్రి ఎమ్మార్వో కార్యాలయం వద్ద మౌనదీక్ష చేపడతామని టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఉద్రిక్తతలు చెలరేగకుండా జేసీ సోదరులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. జేసీ దివాకర్‌రెడ్డిని జూటూరులోని ఆయన తోటలో గృహ నిర్బంధం చేయగా, ఆయన సోదరుడు ప్రభాకర్‌రెడ్డిని తాడిపత్రిలోని ఆయన నివాసంలో నిర్బంధించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పోలీసులు నిర్వీర్యం చేస్తున్నారని జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.