ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమలహాసన్ పూర్తి స్థాయిలో రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారపర్వంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో ఇటీవల కమల్ మాట్లాడుతూ, తాము అధికారంలోకి వస్తే ఇంటి పనిని కూడా వేతన వృత్తిగా గుర్తిస్తామని అన్నారు. కమల్ ఆలోచనను కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కూడా ప్రశంసించారు. అయితే, ఈ వ్యాఖ్యలను బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తప్పు పట్టారు.