బ్రిటన్ నుంచి మన దేశంలో అడుగుపెట్టిన కరోనా కొత్త స్ట్రెయిన్ కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. యూకే నుంచి వచ్చిన మరో 20 మందిలో కొత్త స్ట్రెయిన్ ను గుర్తించారు. దీంతో, ప్రస్తుతం ఈ కేసుల సంఖ్య 58కి చేరినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్త స్ట్రెయిన్ బాధితులందరినీ వారి రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన సింగిల్ రూమ్ ఐసొలేషన్లలో ఉంచినట్టు వెల్లడించింది. వీరితో పాటు విమానంలో ప్రయాణించిన తోటి ప్రయాణికులను, కుటుంబీకులను, కాంటాక్ట్ లోకి వచ్చిన వారిని ట్రేస్ చేస్తున్నారని చెప్పారు. పరిస్థితిని చాలా క్లోజ్ గా పరిశీలిస్తున్నామని, రాష్ట్రాలకు ఎప్పటికప్పుడు తగు సూచనలు ఇస్తున్నామని తెలిపింది.