తెలంగాణ లో రాజకీయాలన్నీ ఒక ఎత్తు అయితే కాంగ్రెస్ పార్టీ పీసీసీ నియామకం ఒక ఎత్తు అవుతుంది.. పార్టీ లోని నేతలంతా ప్రతిపక్ష అధికార పార్టీ లాగా పీసీసీ పదవి కోసం కొట్టుకుంటున్నారు.. ఆయనకి ఇవ్వొదంటే ఆయనకి ఇవ్వొదంటూ తమని తామే విమర్శించుకుంటూ ప్రజల వద్ద నవ్వుల పాలు అవుతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో అన్ని పార్టీలకన్నా కాంగ్రెస్ ఇప్పుడు దారుణమైన స్థితికి చేరుకుంది. తెలంగాణ రావడానికి ముఖ్య కారణం కాంగ్రెస్ అయినా ఆ పార్టీ ని ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు.