ఆంధ్రప్రదేశ్ లో కలకలం సృష్టిస్తున్న రామతీర్థం ఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేల చేసింది అని చెప్పొచ్చు. కొంతమంది దుండగులు హిందువుల ఆరాధ్య దైవం రాముని శిరస్సు ని ఖండించి పెద్ద వివాదానికి తెరలేపారు.. హిందుత్వ సంఘాలు ఈ పరిణామంపై ఆగ్రహం వ్యక్తం చేయగా ప్రభుత్వం వెంటనే దీనిని సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేయిస్తున్నారు. ఇక ప్రతిపక్షాల సంగతి చెప్పనవసరం లేదు.. మత రాజకీయాలు, కుల రాజకీయాలకు అలవాటుపడ్డ ఈ పార్టీ లు దీనిని పెద్ద ఇష్యూ చేసే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టాయి.