బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు కృష్ణంరాజుకు గవర్నర్ పదవి ఇవ్వబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. తమిళనాడు గవర్నర్ గా ఆయనను నియమించబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు, కృష్ణంరాజుకు అభినందనలు తెలుపుతూ ట్వీట్లు కూడా వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా హీరో ప్రభాస్ అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. తమ అభిమాన హీరో పెదనాన్నకు గవర్నర్ పదవిని ఇవ్వబోతున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.