ఏపీలో గడచిన 24 గంటల్లో 59,410 కరోనా టెస్టులు నిర్వహించగా, 295 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 45 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 39, గుంటూరు జిల్లాలో 35, తూర్పుగోదావరిలో 32 కేసులు గుర్తించారు. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 4 కేసులు రాగా, శ్రీకాకుళం జిల్లాలో 9, కడప జిల్లాలో 10 కేసులు నమోదయ్యాయి.