దేశంలో ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దేశవ్యాప్తంగా నీరుగారిపోయింది. సోనియా గాంధీ తర్వాత సరైన నాయకత్వం లేక పార్టీ ఒక్కసారిగా పేకమేడలా కూలిపోయింది. ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు డిపాజిట్లు పొందే పరిస్థితి కూడా లేదు.. అందుకు కారణం ఎదో తేలీదు కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు శాసించిన ప్రాంతీయ పార్టీ లను అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. దేశంలో ఎలా ఉన్నా, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లో మరింత దయనీయ పరిస్థితి కి చేరుకుంది..