తెలుగు రాష్ట్రాల్లో ఎంతో సాఫీ గా సాగిపోతున్న పాలనను కుదిపేయడానికి బీజేపీ పార్టీ దూసుకొస్తోంది.. ఉత్తరాదిన బలంగా ఉన్న బీజేపీ పార్టీ ఇప్పుడు దక్షిణాదిన కూడా పాతుకుపోవాలని చూస్తుంది. ఇప్పటికే కర్ణాటక లో అధికారంలో ఉన్న బీజేపీ కన్ను ఇప్పుడు తెలుగు రాష్ట్రాలపై ఉంది.. తమిళనాడు, కేరళలో కూడా పాగా వేయాలని చూస్తుంది.. ఇకపోతే దక్షిణాదిన బలపడాలని చూస్తున్న పార్టీ కి తెలంగాణ లో బలపడడం ఇప్పుడు ఊతం దొరికినట్లయింది.. తెలంగాణ లో వరుస గెలుపులు వారికి కలిసి వస్తున్నాయి.