గత కొన్ని రోజులుగా తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. దేశంలో గొప్ప పార్టీ, చరిత్ర కలిగిన పార్టీ గా పేరున్న కాంగ్రెస్ ని ప్రజలు నమ్మే పరిస్థితి అయితే లేదు. దేశంలో ఎలా ఉన్నా, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లో మరింత దయనీయ పరిస్థితి కి చేరుకుంది.. తెలంగాణ వచ్చిన తరువాత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ దే ఎప్పుడు పైచేయి ఉంటుందని భావించారు కానీ కేసీఆర్ తెరాస తో కాంగ్రెస్ పై నెగ్గాడు. వరుసగా రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ని చిత్తు చిత్తుగా ఓడించాడు.