రాష్ట్రంలో జరుగుతున్న టీడీపీ నేతల అరెస్ట్ లు గతంలో ఎప్పుడు జరగలేదనే చెప్పాలి.. అవినీతి కి పాల్పడ్డ నేతలే కాకుండా మర్డర్ , కిడ్నప్ కేసుల్లో ప్రధాన నిందితులుగా ఉన్న నేతలను కూడా వైసీపీ ప్రభుత్వం వదిలిపెట్టట్లేదు.. అనుమానం వచ్చిందంటే చాలు కటకటాల్లోకి నెడుతుంది. ఇప్పటికే అచ్చెన్నా, జేసీ, కోళ్లు రవీంద్ర వంటి టీడీపీ నేతల భరతం పట్టారు. ఇంకొందరిని జైల్లో పెట్టేందుకు రంగం కూడా సిద్ధమవుతుంది.. ఈ నేపథ్యంలో ఇప్పుడు భూమా అఖిల్ ప్రియా అరెస్ట్ రాష్ట్రంలో పెద్ద సంచలనం గా మారింది..