ప్రశాంత్ కిషోర్.. గత ఎన్నికల సమయంలో ఈ పేరు మార్మోగిపోయింది. ఎన్నికల వ్యూహకర్త గా ప్రశాంత్ కిషోర్ కి దేశవ్యాప్తంగా మంచి పేరుంది. ఎలాంటి సామాన్య పార్టీ నైనా అసామాన్య స్థాయికి తీసుకురావడం ప్రశాంత్ స్పెషలిటీ.. ఏపీ లో సామాన్య పార్టీ గా ఉన్న వైస్సార్ సీపీ పార్టీ ని అధికారంలో కి తీసుకొచ్చిన ఘనత ప్రశాంత్ కి కూడా కొంచెం ఇవ్వాలి.. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ప్రణాళికలు పార్టీ పై ప్రభావం చూపి లోపాలను సరిదిద్దుకునే చేసింది. జగన్ కూడా ప్రశాంత్ పై పూర్తి నమ్మకం ఉంచాడు కాబట్టే పార్టీ కూడా ఈ రేంజ్ లో గెలిచింది..