ఏపీ లో వరుస సంఘటనలు ఎంతో ఆసక్తి ని రేపుతున్నాయి. దేవాలయాలపై దాడులు, ఆధిక్యత, విమర్శలు, స్థానిక ఎన్నికల రగడ ఇవన్నీ చూస్తుంటే అసెంబ్లీ ఎన్నికల వాతావరణం స్పష్టంగా తెలుస్తుంది.. అయితే ఒక్కసారిగా ఇంత ఎత్తున చర్చలు జరగడానికి ఒకే మూలం తిరుపతి ఉప ఎన్నిక. మరి కొన్ని రోజుల్లో తిరుపతి లో ఉప ఎన్నిక జరగనుంది. ఇక్కడ గెలుపుకోసం అన్ని పార్టీ లు ఎదురుచూస్తుండగా టీడీపీ ఇక్కడ గెలిచి పరువు నిలబెట్టుకోవాలని చూస్తుంది.. చంద్రబాబు అందరికంటే ముందుగానే ఇక్కడ అభ్యర్థి ని ప్రకటించి రేస్ లో తామే ముందున్నట్లు ప్రకటించుకున్నాడు.