ఏపీలో స్థానిక ఎన్నికల చిచ్చు ఇప్పట్లో ఆగేలా లేదు. ఒకసారి ఒకరు వద్దంటే ఇంకోసారి ఇంకొకరు వద్దని అంటున్నారు.. కోట్ల మంది ప్రజలు గెలిపించిన వైసీపీ ప్రభుత్వాన్ని కాదని ప్రభుత్వం నియమించిన అధికారి అధికార పార్టీ కి వ్యతిరేకంగా వెళ్ళడం ఇప్పుడు ఏపీ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మొదటినుంచి జగన్ వైఖరి కి భిన్నంగా ఉన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ఇప్పుడు ఒకడుగు ముందుకేసి స్థానిక ఎన్నికల షెడ్యూల్ ని రిలీజ్ చేశాడు. దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా ప్రకంపనలు మొదలయ్యాయి..