గత కొన్ని రోజులుగా డల్ గా ఉండడం బీజేపీ కి ఏమైందనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. భారీ ఎత్తున పుంజుకుంటామని.. వచ్చే 2024లో పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుందని.. ఇదే తమ ప్రధాన సంకల్పమని బీజేపీ నేతలు పదే పదే చెబుతున్నారు. అంతేకాదు.. ఏపీ ఈ మాత్రమైనా అభివృద్ధి చెందిందంటే బీజేపీ చలవేనని.. కేంద్రంలోని బీజేపీ పెద్దలు సానుకూలంగా ఉన్నారు కనుకే.. ఏపీలో ప్రజలు సుఖంగా ఉన్నారని చెబుతున్నారు. మరి ఇంత చెబుతున్నా.. ఈ విషయాన్ని క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లే నేతలు ఎక్కడ ? అనే ప్రశ్నకు మాత్రం సమాధానం లేకుండా పోయింది. బిజేపీలో ఒక లైన్ అనేది క్లారిటీ లేకుండా పోయింది. కొన్ని రోజులు టీడీపీపై ఫైరవుతారు. మరికొన్ని రోజులు వైసీపీపై ఫైరవుతారు. మరి బీజేపీ కి సరైన వ్యూహం ఎవరు వేస్తారో చూడాలి..