గత కొన్ని రోజులుగా తెలంగాణ లో ఒక వార్త జోరుగా చర్చనీయాంశమవుతోంది. అదే కేటీఆర్ సీఎం అవుతున్నాడనే విషయం.. కేటీఆర్ త్వరలో సీఎం అవడం గ్యారెంటీ అంటూ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇదే సమయంలో కేసీఆర్ అనారోగ్యంగా ఉన్నారని ఇకముందు అయన ముఖ్యమంత్రి పదవి ని అధిష్టించలేరని అందుకే ఆ బాధ్యత ను కేటీఆర్ కి అప్పగించబోతున్నారని వార్తలు షికార్లు చేస్తున్నారు. ఎవరేమన్నా ఏమనుకున్నా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం ఈ విషయంపై కొంచెం గట్టిగానే స్పందించారు.