తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ ఎంతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఇటీవలే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా అయన ఈ రకమైన స్పీచ్ ఇచ్చారని చెప్పొచ్చు.. గతంలో కన్నా తెరాస పార్టీ దూకుడు ఇప్పుడు తగ్గింది. వరుస ఎదురుదెబ్బలు చూస్తుంటే ఈసారి అధికారంలో కి రావడం కష్టమే అనిపిస్తుంది.. కేసీఆర్ కి తెలంగాణ వచ్చిన తర్వాత ఎదురులేదు. ఈ నేపథ్యంలో దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాలు ఒక్కసారిగా సీన్ మొత్తం మార్చేసింది. కొన్ని రోజుల్లోనే బీజేపీ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగింది.