రాష్ట్రంలో నిమ్మగడ్డ ఏం చేస్తున్నాడో ఎవరికీ అర్థం కావట్లేదు. తనకు ఇష్టం వచ్చినప్పుడు ఎన్నికలు అంటున్నాడు. ఇష్టం లేనప్పుడు ఎన్నికలు వాయిదా వేస్తున్నాడు. ప్రజల ఆరోగ్యం ఫై ఏమాత్రం బాధ్యత లేకుండా ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ అంటున్న సమయంలో స్థానిక ఎన్నికలని పట్టుబట్టీ మరీ షెడ్యూల్ వేశాడు.రాష్ట్ర ప్రభుత్వంతో పాటు , పలు ఉద్యోగ , ప్రజా సంఘాల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో పాటు కరోనా విస్తృతి పూర్తిగా తగ్గని ఈ సమయంలో కరోనా విధులతో పాటు , వ్యాక్సిన్ ప్రక్రియ కూడా చేపట్టాల్సి ఉన్నందున ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని తేల్చిచెప్పారు . రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హై కోర్ట్ లో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది .