ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు లాగే డబుల్ గేమ్ లు, నీచ రాజకీయాలు చేస్తున్నాడా అంటే ఇటీవలే అయన చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. ఓ పెద్ద కుంభ కోణంలో ఆరోపణలు ఎదుర్కొని ఇటీవలే జైలుకి వెళ్లి వచ్చిన అచ్చెన్నా టీడీపీ అధ్యక్ష పదవి చేపట్టగానే ఎంతో దూకుడుగా వ్యవహరిస్తున్నాడు.. అధికార పార్టీ ని విమర్శించడమే లక్ష్యంగా చంద్రబాబు కు మించి నోటికి పని చెప్తున్నాడు..