తెలంగాణ రాజకీయాల్లో అనూహ్యమైన మార్పు తెచ్చిన నాయకుడు బండి సంజయ్.. అప్పటివరకు సామాన్య నాయకుడిగా ఉన్నా బండి సంజయ్ బీజేపీ పార్టీ ఎంపీ గా గెలుపొందిన తర్వాత తన దూకుడు ని పెంచాడు. కొన్నాళ్ళకు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక అయన తన దూకుడు ని మరింత పెచాడు.. అధికార పార్టీ ని విమర్శించి వెనక్కి నెట్టేయాలనే లక్ష్యంతో బండి సంజయ్ వేసిన తొలిఅడుగు దుబ్బాక రూపంలో మంచి ఫలితాన్ని ఇచ్చింది.. అప్పటివరకు తెరాస పార్టీ ఒక్కటే తెలంగాణ లో దిక్కు అన్న భావన ను బండి సంజయ్ తుడిచిపెట్టుకుపోయేలా చేశాడు.