ఎన్నికల్లో ఓటమి దగ్గరినుంచి ఇప్పటివరకు టీడీపీ కి ఒక్క అంశం కూడా కలిసి రాలేదు.. ఓటమితో పాటే టీడీపీ కి బాడ్ లక్ కూడా నెత్తిమీద కూర్చుంది. ఈజీ గా గెలుస్తుందన్న పార్టీ దారుణంగా ఓడిపోవడం ఒక ఎత్తు అయితే ఓటమి దగ్గరినుంచి ఇప్పటి వరకు పార్టీ ఉపయోగపడే పని ఒక్కటి కూడా లేదనేది మరొక ఎత్తు.దీనికి చంద్రబాబు వైఖరి ఒక కారణం అయితే మరో కారణం పార్టీ సీనియర్ నేతల గొంతు మూగాబోవడం.. దాదాపు ఇరవై నెలలు పార్టీ చీకట్లో బ్రతికింది చెప్పొచ్చు.. నేతలు కూడా ఎవరు టీడీపీ కి మద్దతు ఇస్తూ పోరాటం చేయకపోవడం ఈ పార్టీ ప్రయోజనాలను మరింత దెబ్బ తీసింది.