ఏదైనా నాశనం అవడానికి ఎవరో ఎక్కడినుంచో దిగి రావాల్సిన వారు అవసరం లేదు.. పక్కనే ఉన్నవారు చాలు దాన్ని నాశనం చేయడానికి. ముఖ్యంగా రాజకీయాల్లో ఇది బాగా వర్తిస్తుంది. ఒక పార్టీ నాశన మైపోవడడానికి ఇతర పార్టీ ల అవసరం లేకుండా తమకు తెలియకుండానే తమ పార్టీ ని నాశనం చేసుకుంటూ ఉంటారు.. ఇది అక్షరాలా టీడీపీ కి సరిపోతుంది.. పార్టీ ని బలోపేతం చేయాలనీ భావిస్తున్న చంద్రబాబు చేజేతులా పార్టీ పతనానికి పునాదులు వేశాడు. మితిమీరిన రాజకీయ జ్ఞానం, అనుభవం ఉంటే ఇలానే అవుతుందని చంద్రబాబు మరోమారు నిరూపించాడు.