తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇంత దారుణంగా ఎన్నడూ లేదు.. గత కొన్ని ఎన్నికలనుంచి ఈ పార్టీ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోతుంది. ప్రతిసారి ఎదో కారణం చెప్పి తమకు తామే సర్ది చెప్పుకుంటున్నారు పార్టీ నేతలు.. తెలంగాణ ఇచ్చిన రాష్ట్రంగా కాంగ్రెస్ కు పేరైతే ఉంది కానీ పెత్తనం అంత తెరాస దే.. పార్టీ లోని లీడర్ లు కలిసి కట్టుగా లేకపోవడం వల్లే పార్టీ ఈ స్థితి కి వచ్చిందని చెప్పొచ్చు. సీనియర్ లకు, కొత్త గా వచ్చిన లీడర్ లకు పడకపోవడం తో ప్రజల నమ్మకం కోల్పోయింది పార్టీ.. బహిరంగంగగానే సొంత పార్టీ నేతలను విమర్శిస్తూ పార్టీ లోని డొల్లతనాన్ని చాటిచెప్తున్నారు..