దేశ రాజధాని నడిబొడ్డు ఢిల్లీ లో రైతులు ఎముకలు కొరికే చలిలో చేస్తున్న పోరాటం గురించి అందరికి తెలిసిందే.. మోడీ ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టిన రైతులతో ప్రభుత్వం ఎన్ని చర్చలు జరిపినా ఆ చట్టాన్ని రద్దు చేయడమే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తున్నారు. పంజాబ్, బీహార్ రైతులు మొదలుపెట్టిన ఈ ఉద్యమానికి దేశం మొత్తంగా రైతులు తమ సంఘీభావాన్ని తెలియజేయగా వారితో పాటు ఉద్యమంలో పాల్గొనడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి, రైతు సంఘాలకు అనేక మార్లు చర్చలు జరగగా అవి విఫలం అయ్యాయి..