రాష్ట్రంలో పరిస్థితులు వైసీపీ పార్టీ కి ఏమంత అనుకూలంగా లేవు.. ప్రతిపక్షాలు జగన్ ని టార్గెట్ చేసి విపరీతమైన విమర్శలు చేస్తున్నాయి. ఓ వైపు టీడీపీ మరోవైపు జనసేన , బీజేపీ పార్టీ లు పోటా పోటీ గా జగన్ ను విమర్శించి అధికారంలోకి రావాలని చూస్తున్నాయి. చంద్రబాబు పర్సనల్ ఎటాక్ చేస్తుంటే బీజేపీ మాత్రం రాష్ట్రంలో జరిగే కొన్ని పరిణామాలను ఆసరాగా చేసుకుని అందులో లూప్ హోల్స్ ని వెతికి మరీ జగన్ ను, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. ఇప్పటికే రామతీర్థం ఘటన పై చేయాల్సిన హంగమని ప్రతిపక్షాలు చేసేశాయి.. ఇందులో జగన్ ని పూర్తిగా విలన్ గా చూపించడానికి ప్రయత్నిస్తున్నాయి..