ప్రస్తుతం రాష్ట్రంలో బర్నింగ్ టాపిక్ గా మారాడు నిమ్మగడ్డ రమేష్.. ఎన్నికల అధికారిగా మొన్నటివరకు ఎవరికీ కూడా తెలీని నిమ్మగడ్డ రమేష్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగానూ చర్చలో ఉంటున్నాడు.. రాష్ట్రంలో పదినెలలక్రితం మొదలైన ఎన్నికల వివాదం ఇప్పటికీ నానుతూనే ఉంది.. కరోనా లేని సమయంలో ఎన్నికలు వాయిదా వేయించి ఇప్పుడు విజృంభిస్తుంటే ఎన్నికలు నిర్వహించాలి అని మంకు పడుతూ ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పిస్తున్నారు.. దీనిపై వైసీపీ నేతలు ఎంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా అయన ఏమాత్రం తగ్గకపోవడం వారికీ అస్సలు మింగుడు పడడం లేదు.