తన నియామకానికి ముఖ్య కారణమైన వారి ఋణం చెల్లించుకోవడానికి నిమ్మగడ్డ రమేష్ రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఉన్న తన అధికారాలను ఉపయోగించుకుని చేసిన అన్యాయాలను అందరు స్వయంగా చూస్తూనే ఉన్నారు. వివాదమే మార్గంగా అయన వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు రాష్ట్ర వ్యాఫ్తంగా చర్చనీయంశంగా మారిపోయింది. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గరినుంచి ఏ ఒక్క విషయంలోనూ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయలేదు. ఎడ్డం అంటే తెడ్డం అంటూ పాలనను సరిగ్గా చేయనీకుండా పదిరోజులకోసారి ఎన్నికల ప్రస్తావన తెస్తూ చికాకు పెట్టిస్తున్నారు. కరోనా సమయంలో ఎన్నికలు కావాలని మంకు పట్టు పట్టి నానా రాద్ధాంతం చేస్తున్నాడు.