జనసేన పార్టీ ఏ సమయంలో బీజేపీ తో పొత్తుకు చేయి కలిపిందో కానీ అప్పటినుంచి జనసేన వాయిస్ ప్రజలకు పెద్దగా వినపడడం లేదు.. బీజేపీ, జనసేన ద్వయంలో బీజేపీ పార్టీ పైచేయి సాధిస్తుందని వారు చేసే చర్యలను బట్టి స్పష్టంగా తెలుస్తుంది.. ఇప్పటికే జనసేన ను గ్రేటర్ ఎన్నికల్లో పాల్గొననీయకుండా చేసింది. ఇప్పుడు తిరుపతిలోనూ బీజేపీ నే పోటీ చేసేలా కనిపిస్తుంది. దీంతో జనసేన వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.. ఇలా ప్రతి దాంట్లో పొత్తు అని చెప్పి తమను వెనక్కి తగ్గేలా చేయడం చూస్తుంటే తొందరలోనే పొత్తుకు స్వస్తి చెప్పాలని జనసేన భావిస్తోందట..