టాలీవుడ్ లో విలన్ పాత్ర కి ఎంత ప్రాధాన్యత ఉంటుందో అందరికి తెలిసిందే.. విలన్ ఎంత బలవంతుడై ఉంటే అతన్ని కొట్టే హీరో అంత ఎలివేట్ అవుతాడు అన్నది ఇక్కడి దర్శక నిర్మాతల అభిప్రాయం.. హీరో ఎంత సింపుల్ గా ఉన్నా, విలన్ మాత్రం కండలు తిరిగిన బాడీ తో, రింగుల జుట్టు తో చూడడానికి భయపడేలా ఉండాలి.. అలాంటి వాడిని కొట్టే హీరో ఎంత నార్మల్ గా ఉంటే సినిమా అంత సూపర్ హిట్.. ఈ ట్రెండ్ ని గత కొన్ని దశాబ్దాలుగా టాలీవుడ్ పాటిస్తూ వస్తుంది. ఈ విలన్ పాత్రల కోసం గతంలో కొంతమంది నటులు సెపరేట్ గా ఉండేవారు.. వారు మాత్రమే ఈ పాత్రలను వేసి ప్రేక్షకులను మెప్పించేవారు.