తెలంగాణ లో అసలు సిసలు రాజకీయం ఇప్పుడే మొదలైంది.. ఇన్నాళ్లు తెరాస పార్టీ ఆధిపత్యం తో టీ ఆర్ ఎస్ పార్టీ నాయకులకు ఎత్తులు పైఎత్తులు వేయనవసరం రాలేదు.. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. బీజేపీ రాకతో తెరాస నేతలు తుప్పుపట్టిన తమ మెదళ్ళకు పనిచెప్పాల్సిన అవసరం ఏర్పడింది.. ఓ వైపు బండి సంజయ్ తెరాస పై విమర్శలు చేసుకుంటూ పోతుంటే తెరాస నేతలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం పార్టీ అధిష్టానానికి ఇబ్బంది గా మారింది.. వారిలో చైతన్యం కలిగించేలా కేటీఆర్ నడుంబిగించారు. బలపడుతున్న బీజేపీ పార్టీ కి అడ్డుకట్ట వేసేందుకు అన్ని నియోజక వర్గాల నాయకులను యాక్టివేట్ చేస్తున్నారు..