ఏపీ లో బలపడాలని గత కొన్ని రోజులుగా బీజేపీ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. సోము వీర్రాజు అధ్యక్షతన కొన్ని ప్రధానాంశాల్లో బీజేపీ అధికార ప్రభుత్వంపై నిరసనలు కూడా చేపట్టి ప్రజల్లోకి దూసుకెళ్తుంది.. అంతర్వేది, దుర్గగుడి, మొన్నటి రామతీర్థం వంటి విషయాల్లో బీజేపీ పార్టీ చేసిన హల్చల్ అంతా ఇంతా కాదు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కన్నా బీజేపీ ఈ విషయంలో దూకుడుగా వ్యవహరించి ప్రజల్లో కొంత నమ్మకం ఏర్పరుచుకుంది. ఈ నేపథ్యంలో మరింత బలపడడానికి కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టింది..