ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి ఉప ఎన్నికకు రంగం సిద్ధం అవుతుంది. మరికొన్ని రోజుల్లో ఇక్కడ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి ఎన్నికల ప్రచారానికి శంఖం పూరించినట్లు అవుతుంది..ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ఈ ఉప ఎన్నికలో పాల్గొనబోయే అభ్యర్థిని ప్రకటించాడు. అందరికన్నా ముందుగా తానే ప్రకటించి ఈ ఉప ఎన్నిక తమకు ఎంత ముఖ్యమైనదో చాటిచెప్పాడు.. గెలుపుకోసం కొన్ని ప్రణాళికలు కూడా వేసుకున్నాడు.. ప్రభుత్వం వైఫల్యం చెందిన అంశాలను హైలైట్ చేసే విధంగా ఇక్కడి కార్యకర్తలకు హితబోధ చేశాడు..