మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా లో కాజల్ కథానాయికగా నటిస్తుండగా, రామ్ చరణ్ ఓ కీలక పాత్ర లో నటిస్తున్నాడు. కాగా ఇటీవలే రామ్ చరణ్ లుక్ రిలీజ్ అయ్యింది.. సిద్ధ అనే పాత్రలో రామ్ చరణ్ నటిస్తుండగా ఈ పాత్ర లుక్ ని రిలీజ్ చేసింది చిత్ర బృందం.. ఈ లుక్ తో సినిమా పై అంచనాలు మరింత పెరిగాయని చెప్పొచ్చు. మొన్నటివరకు మోషన్ పోస్టర్ నే రిలీజ్ చేసిన చిత్ర బృందం ఈ లుక్ రిలీజ్ చేయడంతో సినిమాపై హైప్ ని ఒక్కసారిగా పెంచింది..