తెలంగాణ లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు అందరికి తెలిసిందే.. రాజకీయంగా బీజేపీ బలపడడం, రాబోయే ఎన్నికలు, ప్రజల వ్యతిరేకత ఇవన్నీ ఒక ఎత్తు అయితే తెరాస పార్టీ లో జరుగుతున్న అంతర్మథనం ఒక ఎత్తు.. తెరాస పార్టీ నుంచి భవిష్యత్ ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.. దీంట్లో డౌట్ ఏంటి కేసీఆర్ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేటీఆర్ కదా అని మీరనుకోవచ్చు.. అయితే ఇది ఒకప్పటి మాట.. ఇప్పుడు ఆ పార్టీ నుంచి కేసీఆర్ కుమార్తె కవిత కూడా సీఎం అవ్వాలని తండ్రి ముందు కోరిక వెళ్లబుచ్చిందట.. సోషల్ మీడియా లో ఈ వార్తలు షికార్లు చేస్తుండగా, ఆమెకు అనూహ్యంగా పార్టీ లో మద్దతు కూడా పెరిగిపోతోందట..