దేశంలోని ఏ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సరితూగవు.. ఇక్కడ ఉన్న ఎత్తులు, పై ఎత్తులు, ప్రణాళికలు, వ్యూహాలు ఏ రాష్ట్రంలోనూ ఎక్కువగా కనిపించవు. ఇక్కడి రాజకీయాలు ఎప్పుడు ప్రత్యేకంగానే ఉంటాయి. ఇక్కడి నేతలు విమర్శలు, వాగ్వాదాలు, ప్రసంగాలు వింటే ఎవరికైనా మతిపోవాల్సిందే.. ఇక్కడ కులం, మతం, విద్వేషాలు, వింత వాదనలు వింటే ఎంతటి జాతీయ నేత అయినా ఆశ్చర్యపోవాల్సిందే.. ముఖ్యంగా ఏపీ లో టీడీపీ ప్రతిపక్షంలోకి వచ్చాక వారి విమర్శలు చూస్తే ఎంతటి పొంతన లేకుండా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.