ఏపీలో బీజేపీ పార్టీ ఉత్సాహం చూస్తుంటే ఎన్నికల నాటికి ఏదోకటి చేసే లా కనిపిస్తుంది.. దీనివల్ల అధికార పక్షంలో ఉన్న పార్టీ కి అయినా, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పార్టీ కి అయినా నష్టం జరిగే సూచనలు కనిపిస్తుంది.. ఇప్పటికే బీజేపీ కొంత బలపడడం ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కి కొంత ప్రయోజనాలను దెబ్బ తీసే అంశం కాగా ఇప్పుడు రాష్ట్రంలో చేపడుతున్న ఓ కార్యక్రమం వల్ల ఆ సెగ అధికార పార్టీ కి కూడా తగులుతుందని చెప్పొచ్చు. ఇటీవలే రాష్ట్రంలో జరుగుతున్న వరుస దేవాలయాల దాడులు అందరిలో కలకలం రేపుతుండగా బీజేపీ పార్టీ దీన్ని పెద్ద అంశంగా చేసి రాజకీయంగా బలపడాలని చూస్తుంది..