సినీ నటి, ఫైర్ బ్రాండ్ , నగరి ఎమ్మెల్యే రోజా ని కావాలనే తొక్కేస్తున్నారా.. సొంత పార్టీలోని నేతలే ఆమె ఎదుగుదలకు అడ్డుకట్ట వేస్తున్నారా అంటే ఆమెకు ఎదురవుతున్న సవాళ్లు చూస్తుంటే అదే నిజమనిపిస్తుంది.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆమెకు ప్రోటోకాల్ పరంగా సరైన మర్యాదలు జరగట్లేదని విలపించిన రోజా కు అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే రకమైన ట్రీట్మెంట్ జరుగుతుందని ఆమె ఆరోపిస్తున్నారు.. నగరి నియోజకవర్గం నుంచి వరుసగా రెండో సారి గెలిచినా ఆమె పార్టీ కోసం చాల కష్టపడినా వ్యక్తే అయినా తన పార్లమెంట్ నియోజకవర్గంలోని చాలామంది వైసీపీ నాయకులకు వ్యతిరేకమయ్యారు.