గ్రేటర్ ఎన్నికల ఫలితాలు బీజేపీ లో ఎన్నడు లేని ఉత్సాహం తెచ్చిందని చెప్పొచు.. తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ రోజుకోరకం వ్యాఖ్యలు చేస్తు బీజేపీ లో కొత్త ఉత్సాహాన్ని నెలకొల్పుతున్నారు. . కేసీఆర్ అవినీతి చిట్టా మొత్తం తమ వద్ద ఉందని.. జైలుకు పంపుతామని అదే పనిగా అయన విమర్శించారు.. త్వరలో ప్రభుత్వం కూడా కూలిపోతుందని, అవినీతి ఆధారాలతో త్వరలో కోర్టుకు ఎక్కుతామని చెప్పగా ఇప్పుడు రెండేళ్ళు ఉద్యమాలు చేస్తామని ప్రకటించడం చూస్తుంటే కేవలం భయపెట్టడానికే బీజేపీ నేతలు అలా విమర్శలు చేశారని స్పష్టంగా తెలుస్తుంది.