ఏపీ లో ప్రస్తుతం కొన్ని ఆసక్తికర పరిణామాలు జరుగుతున్న విషయం తెలిసిందే..రాష్ట్రంలో రామతీర్థం ఘటన సెగలు రేపుతుండగా ప్రతిపక్షాలు దీన్ని తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలని ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి.. ఈనేపథ్యంలో బీజేపీ కపిలతీర్థం టూ రామతీర్థం వరకు ఓ రథయాత్ర కూడా ప్రారంభించింది. ప్రతి చోటా ఓ భారీ బహిరంగ సభ ను ఏర్పాటు చేసి అక్కడ జాతీయ నేతలతో పార్టీ తరపున ఆధ్యాత్మిక పోరాటం చేయించాలని కూడా ప్లాన్ వేసింది. అటు టీడీపీ కూడా రామతీర్థం ఘటన ను తాము బలపడేందుకు ఉపయోగించుకోనుంది. సీఎం జగన్ టార్గెట్ గా ఇప్పటికే కొన్ని విమర్శలు చేసింది..