ముగిసిపోయిందనుకున్న స్థానిక ఎన్నికల పంచాయితీ మళ్ళీ పొడిగింపు అయ్యింది. కోర్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ కు ఈ విషయంలో బుద్ధి చెప్పేలా సరైన తీర్పు ఇచ్చింది. దాంతో నిమ్మగడ్డ ఇక బ్యాగ్ సర్దుకోవాల్సిందే అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి నిమ్మగడ్డ తిరుగుబాటు తో మరోసారి ఈ విషయంలో వెయిట్ చేయక తప్పట్లేదు.. ఏపీ లో పంచాయితీ ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న ఉత్కంఠ మరికొన్ని రోజుల పాటు కొనసాగే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం వాదనలు విన్న ఏపీ హై కోర్టు డివిజనల్ బెంచ్ తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పు ఎప్పుడు వెల్లడించేది తెలియాల్సి ఉంది.