ఇండియా గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరు శంకర్.. దక్షినాదినుంచి దేశం మొత్తం గుర్తింపు పొందిన మొదటి దర్శకుడు ఎవరంటే శంకర్ అని చెప్పొచ్చు.. అయన చేసిన భారీ స్థాయిలో ఉండడంతో పాటు భారీ హిట్ లు కూడా కొట్టడంతో అయన కి పాన్ ఇండియా మార్కెట్ ఇదివరకే ఏర్పడింది.. రెండు మూడేళ్లకు సినిమా తీసిన ఆ క్యాస్టింగ్, ఆ స్టోరీ, ఆ ప్రత్యేకతలు ఏ సినిమాలో ఉండవని చెప్పాలి. భారీ ఆలోచనలు, భారీ బడ్జెట్ లూ, పెద్ద హీరోలూ శంకర్ స్టైల్.. మొన్నటివరకు ప్రతిఒక్క హీరో శంకర్ తో సినిమా చేయాలనీ చూసేవారు.. కానీ ఐ సినిమా తర్వాత శంకర్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది..