తెలంగాణ లో కాంగ్రెస్ నేతల మధ్య ఉన్న విభేదాల సంగతి తెలిసిందే.. వారిలో వారికే అసలు పడదు.. సీనియర్ లు అయితే పార్టీ లో తమదే పెత్తనం ఉండాలని కోరుకుంటారు. కొత్తగా ఎవరైనా వచ్చారంటే వారిని పార్టీ లో ఎదగనీయకుండా చేస్తుంటారు. రేవంత్ రెడ్డి విషయంలో ఇది ఇప్పటికే రుజువు అయ్యింది.. అందుకే కాబోలు పార్టీ ఇంత హీనమైన స్థాయికి చేరిపోయింది..కొత్తగా వచ్చిన వారికి సలహాలు ఇవ్వాల్సింది పోయి వారిని తొక్కేసే ధోరణి వల్ల పార్టీ పై ప్రజలకు నమ్మకం లేకుండా పోతుంది. అధికార పార్టీ ని నిలువరించాల్సి పోయి ఎదుగుతున్న బీజేపీ పార్టీ ని నిలువెరించే స్థితి కి కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయింది.