తెలంగాణాలో త్వరలో కేటీఆర్ సీఎం అవుతున్నారనే వార్త హాట్ టాపిక్ గా మారింది.. గత కొన్ని రోజులుగా తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ కల్వకుంట్ల తారక రామారావు సీఎం కాబోతున్నారని మీడియాలో, పార్టీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. తొందర్లోనే కేసీఆర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నారని కేటీఆర్ ఆ బాధ్యతలు చేపట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయనే ప్రచారం రోజు రోజు కి పెరిగిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు డేట్ కూడా ఫిక్స్ చేసినట్లు సోషల్ మీడియా లో వార్తలు ప్రచారం అవుతున్నాయి.. ఫిబ్రవరి 18వ తేదీ కేటీఆర్ పట్టాభిషేకానికి మంచి ముహూర్తంగా కేసీయార్ ఇప్పటికే డిసైడ్ చేశారనే ప్రచారం జరుగుతుంది.