ఈ రోజుల్లో రాజకీయ నాయకులు ఎలాంటి రాజకీయాన్ని చేస్తున్నారంటే ప్రజల ఎమోషన్స్ ని వాడుకుని అవసరం తీరాకా వాటిని గాలికి వదిలేసినట్లుగా రాజకీయాన్ని చేస్తున్నారు. ఎన్నికలు ఉన్న సమయంలో ప్రజల ఎమోషన్ ని గుర్తించి ఆ దిశగా ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల తర్వాత వారి ఎమోషన్ కి ఎలాంటి విలువ లేదని వారి చర్యల ద్వారా తేల్చేస్తున్నారు. గతంలో ఎంతోమంది రాజకీయ నాయకులు ప్రజల మనోభావాలను అడ్డుపెట్టుకుని గెలిచి ఆ తర్వాత వారి మనోభావాలను పట్టించుకోకుండా ప్రజలను మోసం చేయగా ఈ వైఖరి ఇప్పటితరం నాయకుల్లో కూడా ఉందని మరోసారి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మరోసారి రుజువు అయ్యింది.